ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మొదటి దశగా

0
122

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆస్పరి మండలంలోని ఏ.జి రోడ్డు నుంచి శంకరబండ, చిప్పగిరి మండలంలోని నెమకల్ నుంచి సంగాల, హొళగుంద మండలంలోని హొళగుంద మార్లమడికి నుంచి నగరకన్వి వరకు మొత్తం రూ.3.37 కోట్లతో 4.22 కిలోమీటర్లకు గ్రామాల రోడ్ల నుంచి రహదారుల అనుసంధానానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రతిపాదనలు పంపారు...కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఎంపీ నాగరాజు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ వేణుగోపాల్ గారి తో పి.ఎం.జి.ఎస్.వై పథకం పై సమీక్షించారు...ఈ సందర్బంగా జిల్లాలో రహదారులకు అనుసంధానం లేని గ్రామీణ ప్రాంత రోడ్లను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎంపీ ,ఎస్.ఈ గారిని కోరారు...ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ రోడ్లకు రహదారులను అనుసంధానం చేస్తే పల్లె ప్రజలకు ఉపాధి, విద్య మరియు ఇతర సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు..ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ ఈ.ఈ కరెన్న రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు..

Search
Categories
Read More
Himachal Pradesh
हिमाचल में मूसलधार बारिश से जनजीवन प्रभावित भारी आर्थिक नुकसान
हिमाचल प्रदेश में #मूसलधार_बारिश के कारण जनजीवन गंभीर रूप से प्रभावित हुआ है। राज्य आपदा प्रबंधन...
By Pooja Patil 2025-09-13 07:08:31 0 101
Telangana
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు
సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా...
By Vadla Egonda 2025-06-19 10:19:08 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com