నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)

0
320

హైదరాబాద్:

_🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_

"దుర్గాష్టమి"

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో  చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

"దుర్గాష్టమి"

దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము" అని అంటారు.

"మహర్నవమి"

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

"విజయదశమి"

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

"శమీపూజ" చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే "జమ్మిచెట్టు" అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ "అపరాజితా" దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం "పాలపిట్ట" ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

 sidhumaroju 

Search
Categories
Read More
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 167
Andhra Pradesh
పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్
సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి...
By Kothuru Murali 2026-05-31 16:29:51 0 146
Andhra Pradesh
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
  ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా...
By BABJI DADALA 2026-01-12 14:50:58 0 726
Telangana
"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన...
By Sidhu Maroju 2025-09-20 14:25:21 0 340
Andhra Pradesh
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన...
By Rajini Kumari 2026-05-15 12:15:46 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com