భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు

0
99

సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు ప్రాంతాలలో బిఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యవసర సరుకులను అందజేశారు.వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంతంగా పేద ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. వరదల మూలంగా ప్రజలు గల్లంతైన పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.మున్సిపల్ శాఖ తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సౌలభ్యం విషయంలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి వైఖరి అతని హోదాను తగ్గించే విధంగా ఉందని ఆక్షేపించారు.ఇప్పటికైనా వరద మంపు ప్రాంతాలలో బాధితులకు ఆర్థిక సహాయము నిత్యావసర సరుకులను పంపిణీ చేసి,నాలాల పూడిక తీత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై స్పందించిన హరీష్ రావు.  బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.  గ్రామ పంచాయతీలకు  నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని తెలిపారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Maharashtra
Trial Run Begins for Thane Metro Lines 4 & 4A |
Maharashtra Chief Minister Devendra Fadnavis, along with Deputy CM Eknath Shinde and Transport...
By Bhuvaneswari Shanaga 2025-09-22 11:01:04 0 52
Jharkhand
Jharkhand Coal Minister Announces Wage & Safety Reforms for Workers
The #CoalMinister in #Jharkhand announced improved wages and working conditions for coal...
By Pooja Patil 2025-09-13 11:38:14 0 73
Andhra Pradesh
మారిటైమ్ పాలసీ: ఏపీలో నౌకానిర్మాణ కేంద్రానికి కృషి |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు...
By Bhuvaneswari Shanaga 2025-09-26 10:37:51 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com