చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు*....

0
285

వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సయ్యద్ గౌస్ మోహిద్దీన్,

మార్కాపురం....

           ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పి పి పి విధానంతో వైసిపి ప్రభుత్వ హయాంలో మంజూరు అయి నిర్మాణం లో ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మండే ఎండను సైతం లెక్కచేయకుండా విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు,అభిమానులకు కృతజ్ఞతలని వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్భంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే & నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకట్ రెడ్డి , ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ , గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కెపి నాగార్జున్ రెడ్డి , ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవి , కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల నారాయణ , హాజరై వైసీపీ క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని నింపారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు , జంకి వెంకట్ రెడ్డి , బూచేపల్లి వెంకాయమ్మ , మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ వయసును కూడా మరిచి యువకులతో ఉత్సాహంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని, పేద ప్రజల పట్ల అండగా ఉంటామని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి హాజరైన ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు....

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను...
By Sunka Santhosh 2026-04-29 16:52:23 0 120
Telangana
గ్యాస్ సిలిండర్లపై గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం, కీలక ప్రకటన
భారతదేశంలో LPG కొరత కారణంగా ప్రభుత్వం PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు PNG...
By Ponnala Srinivasrao 2026-03-20 12:06:37 0 165
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 125
Telangana
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రెస్ మీట్ .|
సికింద్రాబాద్ :తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్...
By Sidhu Maroju 2025-12-19 13:57:24 0 190
Telangana
మీరు లాయర్ కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా
మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా.....
By Ponnala Srinivasrao 2026-05-16 03:23:15 1 460
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com