అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన

0
93

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి. రైల్వే గేట్ నెం.249, హనుమాన్ ఆలయం సమీపం, మడికట్ల బస్తీ, తుర్కపల్లి, బుడగ జంగం బస్తీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. బియ్యం, గృహోపకరణాలు, టీవీలు సహా ఇంటి వస్తువులు నీటిలో మునిగిపోయాయి. ఒక కుటుంబానికి డోలి రమేష్ ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సమస్యలపై మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో ప్రజలు అధికారులను అప్రమత్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి,హైడ్రా బృందం వెంటనే ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది.  ఈ తనిఖీలో జిహెచ్ఎంసి అధికారులు ఎస్.ఈ. చెన్నారెడ్డి డి.ఈ. రఘు, ఏ.ఈ. రవళి, హైడ్రా ఇన్‌ఛార్జ్ మనికంఠ పాల్గొన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించినందుకు జిహెచ్ఎంసి అధికారులు,హైడ్రా టీంకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డ్ కమ్యూనిటీ మెంబర్ శోభన్ బాబు , మహమ్మద్ జావిద్, జిహెచ్ఎంసి అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Manipur
Authorities Seize 86 Arms and Nearly 974 Ammunition Rounds in Crackdown
In a coordinated multi-district operation, security forces have recovered 86 weapons and...
By Bharat Aawaz 2025-07-17 08:21:28 0 852
Telangana
CBI విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పసివారి పిలుపు|
హైదరాబాద్ జిల్లా:దేశంలో కొన్ని దగ్గు మందుల వాడకంతో పసిప్రాణాలు మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-07 08:35:08 0 62
Rajasthan
RSSB Bars Exam Talks to Stop Paper Leaks |
The Rajasthan Staff Selection Board (RSSB) has banned candidates from discussing exam questions...
By Bhuvaneswari Shanaga 2025-09-19 12:36:06 0 66
Telangana
8 ఏళ్ల పోరాటం ఫలితం: HYDRA చర్య |
హైదరాబాద్‌ పోచారంలో 1978లో 27 ఎకరాల్లో 400 ప్లాట్లతో నిర్మితమైన జీపీ లే అవుట్‌లో, ఓ...
By Akhil Midde 2025-10-25 04:26:32 0 37
Telangana
ఎలీ లిల్లీ కొత్త ఫార్మా హబ్‌కు $1 బిలియన్ |
ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో కొత్త కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్...
By Bhuvaneswari Shanaga 2025-10-06 10:34:36 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com