కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

0
377

కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమౌతున్న సమయం.. కానీ కోబాల్డ్‌పేటలోని ఓ కుటుంబం మాత్రం ఇవేమీ పట్టనంత పుట్టెడు శోకంలో మునిగి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మద్దు సూరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పూర్తి నిరాశ, నిస్పృహలకు లోనైన ఆ కుటుంబానికి శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కొండంత అండగా నిలిచారు.

స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి బుధవారం స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారిలో మనోధైర్యం నింపారు. కుటుంబ సభ్యులతో మమేకమై స్వాంతన చేకూర్చారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులు, గాయాల తీవ్రత గురించి ఆరా తీసి ఆర్ధిక సాయం అందించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఏకంగా తమ ఇంటికే రావడంతో.. ఆ ఇంట నవ వసంతం ముందే విరిసినట్లైంది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఒక కన్ను అయితే కార్యకర్తలు మరో కన్ను అని వ్యాఖ్యానించారు. అందుకే తమ అధినేత ఇటు కార్యకర్తల క్షేమంతో పాటు అటు ప్రజల సంక్షేమానికి సంయుక్తంగా పెద్ద పీట వేస్తుంటారని తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా తామంతా కూడా కార్యకర్తల కష్టసుఖాలలో ఎళ్ళవేళలా తోడు నీడగా ఉంటున్నట్లు చెప్పారు. నిత్యం జగన్ అడుగుజాడల్లో నడిచే తనకు పార్టీనే కుటుంబమని.. కార్యకర్తలే కుటుంబ సభ్యులని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాపతోటి అంబేద్కర్, దూపాటి వంశీ, వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ నాయకులు ఓర్చు శ్రీనివాసరావు, ఆలా కిరణ్, మాదాసు భాగ్యారావు, సింగు నరసింహారావు, రబ్బానీ, కౌండిన్య, రాయప్ప, విజయ, బోడయ్య, బ్రహ్మం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra   Gadkari good news for Andhra Pradesh మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-02-06 04:48:14 0 223
Andhra Pradesh
సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*   *************************** పాత...
By Rajini Kumari 2026-03-14 11:22:28 0 231
Telangana
స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ...
By Avunoori Mahesh 2026-05-29 10:22:00 0 173
BMA
Memetic Drift: How Innocent Images Become Weaponized
Investigative journalists are increasingly analyzing "memetic drift"—the process by which a...
By JoinBMA 2026-08-21 18:45:13 0 323
Telangana
"వాసవీ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన."|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని వాసవీ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-06-16 09:19:16 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com