గూడూరు లో ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ

0
495

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*జెండావిష్కరణలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఆదివారం గూడూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ఏపీయూడబ్ల్యూజే నాయకులు జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సమావేశంలో పేర్కొన్నారు. జర్నలిస్టులందరకు అక్రిడేషన్లు, ఇంటి స్థలాలతోపాటు కొత్త ఇల్లును కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ బీమా, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతతో పోరాటాలు సాగించి హక్కులను సాధించుకోవాలని సమావేశంలో పలువురు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కు సన్మానం చేసి ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లను జర్నలిస్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే స్టేట్ మెంబర్ జీ ఉరుకుందు, గౌరవ సలహాదారులు శ్రీనివాస నాయుడు, తాలూకా సెక్రెటరీ సాక్షి శ్రీనివాసులు, కార్యదర్శులు కిరణ్ కుమార్, దౌలత్ ఖాన్, ప్రభాకరు, లక్ష్మన్న, శరత్, అబ్దుల్లా, అబ్దుల్ లతీఫ్, మహబూబ్ బాషా, షేక్షావలి, ఇస్మాయిల్, మిన్నెల, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 3K
Telangana
తెలంగాణ ప్రభుత్వంతో విద్యాసంస్థల చర్యలు సఫలం.
  హైదరాబాద్:  ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి...
By Sidhu Maroju 2025-09-16 10:18:39 0 131
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 700
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com