అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు

0
634

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  

 

అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం ఎంజి నగర్ కాలనీలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న వాటర్ పైప్ లైన్ లీకేజ్ సమస్య కారణంగా రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారాయి. పలు మార్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎం డబ్ల్యూ బ్ల్యూ ఎస్ ఎస్ బి) అధికారులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.ఈ సమస్యను మహమ్మద్ జావేద్, శోభన్, వెంకట్, దేవేందర్,మహేష్,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో తక్షణమే స్పందించి మెట్రోపాలిటన్ వాటర్ సప్లైఅండ్ సీవరేజ్ బోర్డు సంబంధిత అధికారులకు రెండు రోజులలో ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ జితేందర్ నాథ్ స్పందిస్తూ...గతంలోనే వాటర్ బోర్డ్ అధికారులకు వినతి పత్రం అందజేసి... ఫోన్ ద్వారా కూడా సమస్యను తెలియజేశారు.మొత్తం మచ్చ బొల్లారం ప్రాంతానికి రోజుకు 14 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతోంది. వాల్ కు రంద్రం ఏర్పడడంతో వాటర్ వాల్ లీకేజ్ వల్ల పెద్ద మొత్తంలో నీరు వృదాగా పోతోంది. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి.  తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ప్రస్తుతం వీధుల్లో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు వృద్ధులు, మహిళలు, చిన్నారులు జారిపడి పడిపోవడం వంటి ప్రమాదాలు నెలకొన్నాయి. వాహనదారులు ప్రమాదకరంగా రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వాటర్ బోర్డ్ అధికారులు తక్షణమే స్పందించి లీకేజ్‌ను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు . రోడ్ల మరమ్మతులు చేపట్టి భద్రత కల్పించాలి అని తెలిపారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
BMA
The Ink Still Flows: Journalism’s Fight for Truth in Challenging Times
The Ink Still Flows: Journalism’s Fight for Truth in Challenging Times In a time when...
By BMA (Bharat Media Association) 2025-05-23 05:06:23 0 2K
Andhra Pradesh
అధికారులపై చర్యకు వైఎస్సార్‌సీపీ డిమాండ్ |
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీస్ అధికారిపై జరిగిన అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
By Bhuvaneswari Shanaga 2025-10-07 05:13:14 0 23
Telangana
అక్టోబర్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ రేట్ల మార్పు |
తెలంగాణ పోస్టల్ సర్కిల్ అక్టోబర్ 1 నుండి ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది....
By Bhuvaneswari Shanaga 2025-09-30 06:56:47 0 33
Andhra Pradesh
విశాఖలో ట్రాఫిక్ కట్టడి: క్రికెట్, రాజకీయ రద్దీ |
అక్టోబర్ 10న విశాఖపట్నం మరియు ఆనకపల్లి జిల్లాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కఠినంగా...
By Deepika Doku 2025-10-10 06:00:43 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com