జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.

0
592

 

 హైదరాబాద్ /సికింద్రాబాద్.

 

శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం అవసరం.  మెరుగైన సమాజం కోసం కలసి పని చేయాలి. సీపీ సీవీ ఆనంద్.

ఛోటా న్యూస్ యాప్ పైన కేసును నమోదు చేయడంపైన, అదే విధంగా సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్టు నర్సింగ్ రావును అన్యాయంగా నిర్బంధించడంపై జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టులు, నార్త్ జోన్ జర్నలిస్టుల ప్రతినిధి బృందం, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ స్పందిస్తూ కేసును తొలగిస్తామని హామీ నివ్వడంతో పాటు మరొక్కసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. సీపీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్రతో పాటు జర్నలిస్టుల సహాకారం కూడా ఎంతైనా అవసరమని తెలిపారు. వార్తా ప్రసారంలో సమ్యమానం పాటించాలని, వీడియోల ప్రసారంలోను సున్నితమైన అంశాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ వాస్తవాల ఆధారంగా ప్రచురించిన చోటా న్యూస్ అప్‌పై ఇలా క్రిమినల్ కేసు నమోదు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం చూడాలని కోరారు. సీపీ స్పందన పట్ల జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు గోపి యాదవ్, నగేష్, కునాల్, సురేష్, రత్న కుమార్, రాఘవ, ప్రవీణ్, నార్త్ జోన్ జర్నలిస్టులు రమేష్, నర్సింగ్, శ్రీకాంత్, బాలకృష్ణ, నరేష్, వంశీ, వాసు, మల్లికార్జున్, శ్రీనివాస్, భాగ్యనగర్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి చందు, పాల్గొన్నారు.

--సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు 115/4 సర్వే నంబర్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారి 3...
By Akhil Midde 2025-10-27 04:21:11 0 34
Telangana
హైదరాబాద్‌లో రూ.50 వేలకుపైగా నగదు సీజ్‌ హెచ్చరిక |
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో రూ.50 వేలకుపైగా నగదు రవాణా చేస్తే...
By Bhuvaneswari Shanaga 2025-10-07 11:39:09 0 24
Bihar
సీటు పంచకంలో మోసం.. JMM బహిష్కరణ ప్రకటన |
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అనూహ్యంగా పోటీ నుంచి...
By Deepika Doku 2025-10-21 04:48:10 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com