భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
972

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను...గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.

Search
Categories
Read More
Media Academy
AI in Newsrooms: Revolution or Risk?
AI in Newsrooms: Revolution or Risk? Artificial Intelligence (AI) is no longer just a tech...
By Media Academy 2025-05-02 08:35:23 0 3K
Andhra Pradesh
తీరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక |
బెంగాల్ కింద సముద్రంలో ఏర్పడిన తక్కువ మబ్బుల ప్రెజర్ సిస్టం సెప్టెంబర్ 26న డిప్రెషన్‌గా మారే...
By Bhuvaneswari Shanaga 2025-09-24 08:55:53 0 144
Telangana
ఆర్డినెన్స్, ఎన్నికలపై కీలక చర్చ ప్రారంభం |
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం...
By Bhuvaneswari Shanaga 2025-10-10 07:36:47 0 24
Telangana
కాంగ్రెస్, BJP నుంచి BRSలోకి నేతల ప్రవాహం |
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, BRS పార్టీకి అనూహ్యంగా బలమైన వలసలు...
By Bhuvaneswari Shanaga 2025-09-30 07:26:22 0 31
Telangana
కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణకు ప్రభుత్వం పూనిక |
తెలంగాణ ప్రభుత్వం మెదిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్...
By Bhuvaneswari Shanaga 2025-10-03 12:22:12 0 38
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com