సింగల్ విండో అధ్యక్షునిగా దానమయ్య

0
1K

గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులుగా గూడూరు ప్రముఖ టిడిపి నేత స్వర్గీయ బి కరుణాకర్ రాజు తండ్రి బి దానమయ్య ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండలాలలోని సింగల్ విండో అధ్యక్షులుగా వివిధ సింగల్ విండోలకు చైర్మన్లను ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులు గా గూడూరు మండల మాజీ రైతు సంఘం అధ్యక్షులు బి.దానమయ్యను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పదవి జిల్లా కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిల సహకారంతో తనకు ఈ పదవి వచ్చిందని సింగల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైన దానమయ్య తెలిపారు. అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు తమపై నమ్మకం ఉంచి ఈ పదవి “ ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గూడూరు సింగల్ విండో పరిధిలోని రైతులందరికీ సకాలంలో రుణాలు అందించ డానికి సహకారం అందిస్తానని రైతుల అభివృద్ధికి తన వంతు

సింగల్ విండో ఎన్నికైన అధ్యక్షునిగా దానమయ్య సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. తన కుమారుడు బి సహకారం అందిన ఎన్నో ఏళ్లుగా విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి సహకారంతో గూడూరు పట్టణ అభివృద్ధికి కృషి చేశారని అయితే కరోనా సమయంలో అకాల మృతి చెందడం జరిగిందని స్వర్గీయ కరుణాకర్ రాజు తండ్రిగా తనకు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి లు ఈ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు, కచ్చితంగా వారీ సహకారంతో గూడూరు సింగల్ విండో పరిధిలోని రైతులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి కేడీసీసీ బ్యాంకు నుండి వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. అలాగే బి కరుణాకర్ రాజు కుమారుడు తన మనవడు బి సృజన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. సింగల్ బిండో డైరెక్టర్లుగా రేమట యు వెంకటేశ్వర్లు డి అల్లిపిరాలు ఎంపికైనట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సభ్యుల సహకారంతో గూడూరు సొసైటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సింగల్ విండో చైర్మన్ బి దానమయ్య తెలిపారు.

Search
Categories
Read More
Tamilnadu
Tirupur's Textile Industry Turns to Synthetic Fibers, Eyes Export Boom
Tirupur, Tamil Nadu’s leading textile hub, is undergoing a major transformation....
By Bharat Aawaz 2025-07-28 12:01:25 0 994
Telangana
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
By Sidhu Maroju 2026-02-17 15:51:49 0 182
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు...
By Benguluri Madhubabu 2026-02-02 07:23:44 0 213
Andhra Pradesh
ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-01-03 11:18:46 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com