పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత: చింతూరు డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి

0
86

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చింతూరు డిఎఫ్ ఓ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం చింతూరులో శ్రీ భాస్కర విద్యానికేతన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డిఎఫ్ఓ పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి చాలా ముప్పు ఉందని మట్టి గణపతి విగ్రహాలనే వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సిఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలు వల్ల ఎటువంటి నష్టం ఉండదని, విద్యార్థులకు చిన్నప్పటి నుండే పర్యావరణం మీద అవగాహన కల్పించాలని కోరారు. అలాగే ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ పండుగలు శాంతియుతంగా సాంప్రదాయంగా జరుపుకోవాలని అన్నారు. శ్రీ భాస్కర విద్యానికేతన్ కరస్పాండెంట్ చిరసాని వేణుగోపాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకడమిక్ కోఆర్డినేటర్ త్రివీణ, ప్రిన్సిపాల్ రాంబాబు, ఉపాధ్యాయులు రమేష్, గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

 

#  Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Industrial Growth and Investment Drive
Andhra Pradesh continues to strengthen its position as an emerging industrial hub through...
By Fathima Safa 2026-06-17 05:12:26 0 145
Andhra Pradesh
సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్
ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్...
By Kothuru Murali 2026-01-04 10:51:27 0 233
Andhra Pradesh
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం...
By Ratna Sekhar 2026-02-19 14:33:13 0 338
Telangana
నిజామాబాద్
19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు తన దృష్టికి రావడంతో తన సొంత...
By Sadaq Sadaq 2026-05-23 02:13:05 0 146
Andhra Pradesh
ఉపాధి హామీ వేతనదారుడు మృతి
గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే...
By Boiena Rajesh 2026-04-22 00:35:31 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com