కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు, సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అన్ని కాలనీలను అభివృద్ధి పరచామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రానున్న రోజుల్లో గాజులరామారం డివిజన్ తో పాటు కుత్బుల్లాపూర్ లోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా...
*ఉషోదయ కాలనీ ఫేస్ - 2: -*
1.66 కోట్ల రూపాయలు - బీటీ రోడ్డు పనులు.
*ప్రాగా టూల్స్ :-
40 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
*సాయి గ్రామం :-
22 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
*కట్టమైసమ్మ బస్తీ :-
34 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
*బతుకమ్మ బండ :-
80 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
*శివపురం కాలనీ :-
30 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
*యండమూరి లే ఔట్ :-
60 లక్షలు - సీసీ రోడ్డు పనులు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, మాజీ కార్పొరేటర్ జగన్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, నవాబ్ భాయ్, అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, తెలంగాణ సాయి, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పీరారెడ్డి, కుమారస్వామి, కోటేశ్వరరావు, రవీంద్ర, రామ్ రెడ్డి, టి. ప్రతాపరెడ్డి, గాంధీ, వీరభద్రం, సోమిరెడ్డి, వినోద్ కుమార్, చంద్రశేఖర్, వీరభద్రరావు, శ్రీనివాసరావు, రాజన్న, మధు, కాజా, తిమ్మయ్య, డి. లక్ష్మి, అంబదాస్, జితేంద్ర, మల్లారెడ్డి, శ్రీకాంత్, చెట్ల వెంకటేష్, మంజుల, లక్ష్మణ్ నాయక్, సిద్దయ్య స్వామి, చందన, బాలరాజ్, బండారి శ్రీధర్ ముదిరాజ్, బుర్ర ముఖేష్, భాస్కర్, సుమన్ రెడ్డి, శివానంద్, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz