కొంపల్లి లో కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూమ్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మరియు నటి శ్రీ లీల

0
1K

ఈ షోరూం  ప్రపంచ శ్రేణి వాతావరణంలో విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

 ఈ ప్రాంతంలోని కస్టమర్లకు మెగా-లాంచ్ ఆఫర్‌లను జ్యువెలరీ బ్రాండ్ ప్రకటించింది.

కొంపల్లి: భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఈరోజు కొంపల్లి సమీపంలోని సుచిత్ర సర్కిల్‌ వద్ద నున్న సురభి రామ కాంప్లెక్స్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మరియు నటి శ్రీలీల ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క వివిధ కలెక్షన్ల నుండి విస్తృత శ్రేణి డిజైన్‌లను ఈ షోరూమ్‌ ప్రదర్శిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చుట్టుపక్కల ప్రాంతాలలోని ఆభరణాల ప్రేమికులను అశేషంగా ఆకర్షించింది. అభిమానులు నటీనటులను చూడటానికి పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఈ కార్యక్రమం పట్ల వారు చూపిన ఆసక్తి, నిరీక్షణను ఇది ప్రతిబింబించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ తో నాకున్న దీర్ఘకాల అనుబంధం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ‘నమ్మకమే జీవితం ’ అనే కంపెనీ సిద్దాంతం పట్ల వారి నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సేవా నైపుణ్యం మరియు కస్టమర్ కేంద్రీకృతత పట్ల కంపెనీ యొక్క అచంచలమైన అంకితభావం కళ్యాణ్ జ్యువెలర్స్‌ను దాని సహచర సంస్థల నడుమ భిన్నంగా నిలిపింది. ఈ రోజు మీ అందరినీ కలిసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను , బ్రాండ్ తమ తదుపరి ఉత్తేజకరమైన వృద్ధి దశను ప్రారంభిస్తోన్న వేళ మీ నిరంతర మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను” అని అన్నారు. హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి నటి శ్రీలీల మాట్లాడుతూ,...“ఈ కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనటం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. విశ్వసనీయత, నిజాయితీ మరియు కస్టమర్ల పట్ల అంకితభావానికి పేరుగాంచిన బ్రాండ్‌ కు సంబంధించి ఇంతటి చిరస్మరణీయమైన సందర్భం కోసం ఇక్కడకు రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్ తో స్థానిక ఆభరణాల ప్రియుల హృదయాలను గెలుచుకుంటుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అని అన్నారు. కొత్త షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఒక కంపెనీగా, మేము గణనీయమైన మైలురాళ్లను చేరుకున్నాము. కస్టమర్ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సమగ్ర వ్యవస్థను నిర్మించడంలో గణనీయమైన పురోగతి సాధించాము. గత కొద్ది సంవత్సరాలుగా, మేము ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను వ్యూహాత్మకంగా విస్తరించాము. కొంపల్లిలోని ఈ కొత్త షోరూమ్ మా మార్కెట్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని, అదే సమయంలో మా విలువైన కస్టమర్లకు ఎక్కువ సౌలభ్యం , అవకాశాలను అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ విభిన్నమైన రీతిలో ఉత్తేజకరమైన ఆఫర్లను ప్రకటించింది, దీని ద్వారా ఆభరణాల ప్రేమికులు తమ ఆభరణాల కొనుగోళ్లపై గణనీయమైన పొదుపును పొందే అవకాశం లభిస్తుంది. వినియోగదారులు అన్ని ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపును పొందగలరు*. దీనితో పాటు, కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు - మార్కెట్లో అత్యల్పమైనది మరియు కంపెనీకి చెందిన అన్ని షోరూమ్‌లలో ప్రామాణికమైనది - కూడా వర్తిస్తుంది. ఆభరణాల ప్రేమికులు కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క 4-లెవల్ అష్యూరెన్స్ సర్టిఫికేట్‌ను కూడా అందుకుంటారు, ఇది స్వచ్ఛత, జీవితకాలపు ఆభరణాల ఉచిత నిర్వహణ, వివరణాత్మక ఉత్పత్తి సమాచారం మరియు పారదర్శక మార్పిడి , బై-బ్యాక్ విధానాలకు హామీ ఇస్తుంది. ఈ ధృవీకరణ , తమ కస్టమర్లకు అత్యుత్తమమైన వాటిని అందించడంలో బ్రాండ్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.ఈ షోరూమ్‌లో కళ్యాణ్ యొక్క ప్రసిద్ధ హోమ్ బ్రాండ్‌లు లభిస్తాయి, వాటిలో ముహూరత్ (వెడ్డింగ్ జ్యువెలరీ లైన్), ముద్ర (హ్యాండ్‌క్రాఫ్టెడ్ యాంటిక్ జ్యువెలరీ), నిమా (టెంపుల్ జ్యువెలరీ), గ్లో (డ్యాన్సింగ్ వజ్రాలు), జియా (సాలిటైర్ తరహా వజ్రాల ఆభరణాలు), అనోఖి (అన్‌కట్ వజ్రాలు), అపూర్వ (ప్రత్యేక సందర్భాలలో వజ్రాలు), అంతర (వివాహ వజ్రాలు), హేరా (డైలీ వేర్ వజ్రాలు), రంగ్ (విలువైన స్టోన్స్ జ్యువెలరీ) మరియు ఇటీవల ప్రారంభించబడిన లీల (రంగు రాళ్ళు మరియు వజ్రాల ఆభరణాలు) అందుబాటులోో ఉన్నాయి.

Search
Categories
Read More
Kerala
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
By Pooja Patil 2025-09-16 06:13:35 0 73
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com