ఫోన్ ట్యాపింగ్ లో బిగిస్తున్న ఉచ్చు

0
1K

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బిగుస్తున్న ఉచ్చు. – డీజీపీ, అడిషనల్‌ డీజీపీల వాంగ్మూలాలు నమోదు – జితేందర్‌, అనిల్‌కుమార్‌ల స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన సిట్‌ – మరో ఇద్దరు కాంగ్రెస్‌ నాయకుల వాంగ్మూలాలు కూడా… రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో రోజురోజుకూ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర డీజీపీ జితేందర్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) అదనపు డీజీ అనిల్‌ కుమార్‌ల వాంగ్మూలాలను ఈ కేసుకు సంబంధించి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) అధికారులు నమోదు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా జితేందర్‌, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అనిల్‌ కుమార్‌లు బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో సంఘవిద్రోహ శక్తులు, నిషేధిత మావోయిస్టుల ఫోన్‌ట్యాపింగ్‌ను జరిపే ప్రక్రియను పర్యవేక్షించే రివ్యూ కమిటీలో జితేందర్‌, అనిల్‌ కుమార్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టుయేతర ప్రముఖులకు సంబంధించి ఫోన్‌ట్యాపింగ్‌ జరిపినట్టు తాజా దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న జితేందర్‌, అనిల్‌ కుమార్‌ల దృష్టికి ఈ విషయం వచ్చిందా? అప్పటి ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు తాను నిర్వహించిన ఫోన్‌ట్యాపింగ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తన పైఅధికారుల దృష్టికి తీసుకొచ్చారా.. లేదా.. మొదలైన కోణాల్లో సిట్‌ అధికారులు వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. అయితే, దాదాపు 600కు పైగా ఫోన్‌ నెంబర్లను రివ్యూ కమిటీకి సమర్పించి, ఇవన్నీ కూడా మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులకు సంబంధించినవి గా అప్పటి ఎస్‌ఐబీ అధికారులు సమాచారమిచ్చినట్టు సిట్‌ దృష్టికి వచ్చిందని తెలిసింది. ఈ సందర్భంగా జితేందర్‌, అనిల్‌ కుమార్‌ల నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్‌ అధికారులు వాంగ్మూలంగా సేకరించారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో డీజీపీగా పని చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ మహేందర్‌రెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని సిట్‌ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్‌తో పాటు మరో నాయకుడు సైదులు బుధవారం సిట్‌ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరిగినట్టు వాంగ్మూలమిచ్చారు. కాగా, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, రఘునందన్‌రావులు సిట్‌ ఎదుట వాంగ్మూలాన్ని ఇవ్వటానికి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత వస్తారేమోనని అధికారులు అభిప్రాయపడ్డారు.

Search
Categories
Read More
BMA
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice The British Man Who Stood...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-29 12:48:02 0 4K
Andhra Pradesh
P4 Model for AP | ఏపీకి పి4 మోడల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పి4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) వ్యూహాన్ని అమలు...
By Rahul Pashikanti 2025-09-11 10:52:46 0 24
Telangana
ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ...
By Sidhu Maroju 2025-07-15 13:34:06 0 881
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 1K
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com