నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల

0
1K

సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉప సంఘం లో తనతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని వారికి అన్ని వాస్తవాలు తెలుసని అన్నారు.బనకచర్ల పై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లో కొట్లాడిందే తానని తెలిపారు.కాలేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని,రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు.వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజాపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాలేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జల యజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈనెల 22 న 11 సంవత్సరాల భాజాప పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

 

 

Search
Categories
Read More
Telangana
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...
By Vadla Egonda 2025-07-18 11:36:08 0 1K
Telangana
నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు...
By Sidhu Maroju 2025-11-01 16:27:23 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com