ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

0
1K

జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
By CM_ Krishna 2025-12-16 13:57:05 0 23
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com