అవయవదానంపై చైతన్యం పెంచాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

0
96

ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. అవయవాలను దానం చేయాలనే ఒక చిన్న నిర్ణయం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని, ఇది అత్యంత శక్తివంతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

 

అవయవదానం ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా మరింత మంది పౌరులు అవయవదాతలుగా మారేలా స్ఫూర్తిని నింపాలని పవన్ కల్యాణ్ కోరారు. "ఒక వ్యక్తి తన జీవిత కాలాన్ని పొడిగించుకోలేని స్థితిలో, మరొకరికి ప్రాణదానం చేయడం ద్వారా తన జీవితానికి ఒక సార్థకతను చేకూర్చుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.

 

ప్రతి దానం ఒక నిరీక్షణకు భరోసా అని, ప్రతి దాత తమ మరణానంతరం ఒక గొప్ప వారసత్వాన్ని విడిచి వెళ్తారని పవన్ పేర్కొన్నారు. సమాజంలో అవయవదానం పట్ల ఉదారతను పెంపొందించే సంస్కృతిని అందరం కలిసి నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. "ప్రాణదానం చేయండి.. ఆశను నింపండి, జీవితాలను కాపాడండి" అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.      

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: ఇన్చార్జి మార్పు విషయంలో తిరుపతి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ,
    పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం...
By Kothuru Murali 2026-07-13 16:48:47 0 212
Andhra Pradesh
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వైపాలెం సర్కిల్ సీఐ కె అజయ్ కుమార్ గారు
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష...
By Chennaiah Kati 2026-06-29 05:55:11 0 90
Telangana
తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..!
జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు...
By Sunka Santhosh 2026-05-21 14:27:58 0 159
Andaman & Nikobar Islands
Andaman Strengthens Water Conservation Initiatives
The Andaman & Nicobar Islands continue to prioritize water resource management in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:13:41 0 208
Andhra Pradesh
జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి...
By Boiena Rajesh 2026-07-17 06:10:27 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com