పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వైపాలెం సర్కిల్ సీఐ కె అజయ్ కుమార్ గారు

0
89

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వై.పాలెం సర్కిల్ సీఐ కే.అజయ్ కుమార్ గారు

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సర్కిల్ సీఐ గారు దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, పెండింగ్ యూఐ (UI) కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs), స్మార్ట్ పోలీసింగ్ పారామీటర్ల అమలుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదైన పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసుల పురోగతిని పరిశీలించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నేరాల విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరగా నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ మరియు సమర్థవంతమైన కేసు దర్యాప్తుపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలన
బొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి...
By Boiena Rajesh 2026-08-10 09:54:41 0 140
Andhra Pradesh
పెద్దమండ్యం: 'షైనింగ్ స్టార్' అవార్డులకు విద్యార్థుల ఎంపిక!
పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513...
By Pagadala Venkateswar 2026-07-18 06:53:06 0 99
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 89
Telangana
వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో...
By Pindikura Mahesh 2026-08-23 16:01:48 0 531
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com