నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.

0
1K

సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని సొంత బంధువులనే మోసం చేసిన ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసి వారి నుండి 5 లక్షల 50 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 6 స్టాంపులు, 11 పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డిసిపి సుధేంద్ర తెలిపారు. 30 మందిని మోసగించి 42 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సొంత కుటుంబీకులు,బంధువులకు తక్కువ ధరకే రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామని నమ్మించి నకిలీ పట్టాలను సృష్టించి మోసం చేశారు.పిక్ సార్ట్ యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారుచేసిన ముఠా సభ్యులు 11 మందికి పట్టాలను అందజేశారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అహ్మద్, అంజాద్, కౌసర్ అలీ, రాజశేఖర్ లు ఒక ముఠాగా ఏర్పడి రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని బంధువులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ధరకే రెండు పడక గదుల ఇల్లు వస్తున్నాయన్న ఆశతో వారి బంధువులతో పాటు మరికొంతమంది బండ్లగూడలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల కోసం ఒక్కొక్కరి నుండి 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. బండ్లగూడ లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపి పట్టాలను అందజేస్తామని చెప్పి వారి నుండి డబ్బులు తీసుకుని నకిలీ పట్టాలను ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారుల స్టాంపులు సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టాలను పిక్ సార్ట్ యాప్ ఉపయోగించి సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారి బంధువులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా బండ్లగూడలో నిర్మించిన ఇళ్లను కూడా వారికి చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇల్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలని సృష్టించి మోసం చేసినట్లు బాధితులు గ్రహించి మంగళహాట్ బండ్లగూడ తదితర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 984
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com