రాష్ట్రంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ : కర్నూలు జిల్లా

0
217

కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలోని పెద్ద కడబూర్ పోలీస్ స్టేషన్ రాష్ట్రం లోనే  అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ గా ఎంపికైంది.

డీజీపీ నుండి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ...

 డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, డిఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి.

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. 

2025 వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తమ పోలీసు స్టేషన్ గా కర్నూలు జిల్లా లోని  పెద్దకడుబూరు పోలీసుస్టేషన్ గా ప్రకటించారు. 

ఈ సంధర్బంగా  సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును శుక్రవారం విజయవాడ మంగళగిరిలో ఏపీ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర డీజీపీ శ్రీ హారిష్ కుమార్ గుప్తా ఐపియస్ గారి చేతుల మీదుగా డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్ , పెద్దకడబూరు ఎస్‌ఐ  నిరంజన్ రెడ్డి అందుకున్నారు. 

డీజీపీ వీరిని అభినందించారు. 

జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టా త్మక అవార్డును అందుకోవడం జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణమని కొనియాడారు.

టెక్నాలజీని వినియోగించి లా అండ్‌ ఆర్డర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ సూచించారు. 

డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ..

 నేరాల అదుపు, నేర నియంత్రణ,  సీసీ కెమెరాలు, త్వరితగతిన కేసుల దర్యాప్తు మొదలైన వాటి వల్ల ఈ అవార్డుకు పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఎంపికైందన్నారు.

పెద్దకడుబూరు పోలీసులు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పరిష్కారం,  సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యల్లో  బాగా చురుగ్గా పనిచేశారన్నారు.

ఈ కారణంగా అవార్డు దక్కింది. 

దేశంలో పది పోలీసు స్టేషన్‌లు ఈ అవార్డులకు ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ కు ఆ ఘనత దక్కిందని ,  కేంద్రం హోం శాఖ అవార్డుకు పెద్దకడుబూరు పోలీసు స్టేషన్‌ ఎంపిక కావటం గర్వంగా ఉంది.

సమష్టి కృషితోనే సాధ్యమైంది అని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు తెలిపారు. 

డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి, ఎమ్మిగనూరు డిఎస్పీ, కోసిగి సిఐ,  పెద్దకడుబూరు ఎస్సై, సిబ్బందికి   పోలీసు ఉన్నతాధికారులు,  జిల్లా పోలీసు యంత్రాంగం  అభినందనలు తెలిపారు.


Search
Categories
Read More
Telangana
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌...
By Ponnala Srinivasrao 2026-05-05 02:03:31 0 120
Andhra Pradesh
విజయవాడలో మహిళ దారుణ హత్య
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*   విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి...
By Rajini Kumari 2026-04-14 09:19:12 0 142
Telangana
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
By Boiena Rajesh 2026-03-01 09:10:24 0 186
Andhra Pradesh
గంగమ్మ జాతరలో దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ విచారణ.
మదనపల్లె మండలం వేంపల్లిలో ఈ నెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై...
By Pagadala Venkateswar 2026-04-18 04:00:35 0 110
Andhra Pradesh
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు...ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది...
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల...
By Gadiyapudi Narendra 2026-01-04 16:07:54 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com