ఒకప్పటి స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? తెలంగాణలో #స్మితాసబర్వాల్...ఏపీలో #ఆమ్రపాలి

0
143

తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు. డైనమిజం, వేగవంతమైన నిర్ణయాలు, ప్రజల్లో విపరీతమైన క్రేజ్... బాధ్యత ఏదైనా సరే 'సక్సెస్' అనే పదానికి చిరునామాగా నిలిచారు. ఒకరు ఏపీలో.. మరొకరు తెలంగాణలో.. వారే కాట ఆమ్రపాలి, స్మితా సబర్వాల్. కానీ, కాలం మారింది. పాలన మారింది. బ్యూరోక్రసీ వర్గాల్లో అత్యంత ప్రభావిత అధికారులుగా వెలిగిన ఈ 'సూపర్ స్టార్' ఐఏఎస్ లు ఇప్పుడు సడన్ గా లూప్‌లైన్‌లోకి వెళ్ళిపోయారు. కొన్నాళ్లు వార్తలకు దూరమై, చివరికి పోస్టింగులు లేక సుదీర్ఘ సెలవుల్లోకి వెళ్లే పరిస్థితి దాపురించింది. అసలు ఈ ఇద్దరు డైనమిక్ అధికారుల గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? రాజకీయ సమీకరణాలు, పరిపాలనా ప్రాధాన్యతలు వీరి పాలిట శాపంగా మారాయా? అధికారుల మధ్య జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది.

‎కాట ఆమ్రపాలి న్యాయపోరాటంలో గెలిచినా.. 'పోస్టింగ్' దక్కలేదా?

వరంగల్ కలెక్టర్‌గా, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో, ఆ తర్వాత కేంద్ర పరిపాలనా విభాగంలో తనదైన శైలితో పేరు తెచ్చుకున్నారు కాట ఆమ్రపాలి. రాష్ట్ర విభజన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (DoPT) కేటాయింపుల్లో ఆమెకు ఏపీ క్యాడర్ దక్కింది. అయితే, మొదటి నుంచీ తెలంగాణలోనే పనిచేయాలనేది ఆమె ఆకాంక్ష. ఈ క్రమంలోనే క్యాట్ (CAT), హైకోర్టుల చుట్టూ సుదీర్ఘకాలం పాటు న్యాయపోరాటం సాగించారు. కానీ, కేంద్రం నిబంధనల ప్రకారం ఆమె ఏపీ క్యాడర్‌కు వెళ్లక తప్పలేదు. ఏపీలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ అనుకూలమైన వాతావరణం లేకపోవడం, ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే వరుస సెలవుల్లోకి వెళ్లిన ఆమ్రపాలి, ఆ తర్వాత ఎలాంటి బాధ్యతలు లేని సాధారణ బదిలీని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమర్థత ఉన్నా.. అనుకూలించని సమీకరణాల వల్ల ఆమె సేవలు పక్కనపడిపోయాయి.

‎స్మితా సబర్వాల్ కు 'లౌక్యం' లేకపోయిందా.. రాజకీయ ప్రాధాన్యత తప్పిందా?

తెలంగాణ బ్యూరోక్రసీలో 'క్రేజీ ఐఏఎస్'గా పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్ కథ వేరు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు పదేళ్ల పాటు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)తో పాటు మిషన్ భగీరథ వంటి అత్యంత కీలక ప్రాజెక్టుల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. పాలనలో ఆమె చెప్పిందే వేదంగా సాగింది.

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్యూరోక్రసీలో సహజంగా కనిపించే "పరిస్థితులకు తగ్గట్టు మారే లౌక్యం" ఆమె వద్ద లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వ పరిపాలనా ప్రాధాన్యతలకు సరితూగకపోవడం, మరోవైపు సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆమెను ప్రాధాన్యత లేని శాఖలకు పరిమితం చేసింది. లూప్‌లైన్ పోస్టింగులను స్వీకరించడం కంటే, సెలవుల్లోనే ఉండటానికే ఆమె మొగ్గు చూపడం బ్యూరోక్రసీలో చర్చనీయాంశమైంది.

‎వ్యవస్థకు తీరని లోటే..

రాజకీయ అధికారాలు మారినప్పుడల్లా అధికారుల ప్రాధాన్యతలు మారడం సహజమే. కానీ, అధికారులు తమ సొంత శైలికి కట్టుబడి ఉండటం, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్‌గా మారకపోవడమే వీరిద్దరినీ రేసులో వెనక్కి నెట్టిందనేది స్పష్టమవుతోంది. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ప్రాధాన్యతలు పక్కనబెడితే... ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ వంటి అత్యంత సమర్థులైన అధికారులు పరిపాలనలో చురుగ్గా లేకపోవడం, సెలవులకే పరిమితమవ్వడం రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగానికి నిజంగా తీరని లోటేనని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
By Boiena Rajesh 2026-04-02 05:14:00 0 245
Andhra Pradesh
పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్...
By Kothuru Murali 2026-05-07 12:18:41 0 160
Bharat Aawaz
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
By Benguluri Madhubabu 2026-07-09 12:28:09 0 165
Telangana
Karimnagar: యుద్ధం ప్రభావంతో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
Karimnagar 
By Sunka Santhosh 2026-03-25 09:45:18 0 313
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com