మండలం మల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..!

0
140

మల్లంపేట: ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మల్లంపేటలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

‎కేవలం 150 చదరపు గజాల స్థలాల్లోనే ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా జీ+3 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా, కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

‎ముఖ్యంగా ఇరుకైన గల్లీల్లోనూ ఎలాంటి అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడంతో భవిష్యత్తులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల ద్వారా కొందరు బిల్డర్లు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

‎ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన...
By Sunka Santhosh 2026-07-02 04:39:52 0 282
Andhra Pradesh
First time deemed discam licence policy
ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం...
By G k Nookala 2026-04-24 14:21:43 0 204
Andhra Pradesh
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
By Pagadala Venkateswar 2026-04-21 13:44:16 0 132
Andhra Pradesh
పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు
పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని...
By Kothuru Murali 2026-06-24 17:08:22 0 125
Telangana
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
   సికింద్రాబాద్/ సికింద్రాబాద్.   చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
By Sidhu Maroju 2025-08-11 11:23:38 0 770
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com