వైఫల్యాలకు భయపడొద్దు.. కఠిన మార్గాన్నే ఎంచుకోండి: అమృత వర్సిటీ స్నాతకోత్సవంలో నారా లోకేశ్.

0
100

ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటం ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, మంత్రి లోకేశ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "యువత కేవలం ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు, ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నదే మా లక్ష్యం. వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, నాయకులుగా ఎదగాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాలను, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, యువత నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, నాయకత్వం వహించడానికి అవకాశాలు కల్పిస్తున్నాం" అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు.

Search
Categories
Read More
Assam
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
By Lokeshwari Panthadi 2026-07-01 09:38:25 0 105
Andhra Pradesh
Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.
అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది నాణేల మార్పిడి...
By Pagadala Venkateswar 2026-03-10 12:57:30 0 385
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....   ఎంతో ప్రసిద్ధి...
By BABJI DADALA 2025-12-29 12:26:34 0 410
Telangana
జ్యువలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీనినటి రితికా నాయక్, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS &...
By Avunoori Mahesh 2026-09-01 12:17:33 0 152
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com