Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెంలో ఒకరి అభ్యంతరం కారణంగా 89 రైతు కుటుంబాలకు పాస్‌పుస్తకాలు అందడంలో జాప్యం జరుగుతోంది.

0
104

Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 42-2, 43-2, 45, 49లలో ఉన్న 22.89 ఎకరాల పిత్రార్జిత భూమికి సంబంధించి తమకు 1బి, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని బాధిత రైతులు సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ భూమికి సంబంధించి సుమారు 90 మంది రైతు కుటుంబాలు తరతరాలుగా అనుభవంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల్లో కూడా యజమానుల పేర్లు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ భూమి డీకేటీ లేదా ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు.

 

రైతుల కథనం ప్రకారం, మొత్తం 90 మంది భాగస్తుల్లో ఎన్‌ఆర్‌ఐ చలపతి నాయుడుకు 2.83 ఎకరాల భూమి ఉంది. గతంలో కోర్టు ప్రిలిమినరీ డిక్రీ, కమిషనర్ నివేదిక ఆధారంగా ఆయన భూమికి హద్దులు నిర్ణయించి వేరుచేసినట్లు తెలిపారు. అయినప్పటికీ, 89 మంది భాగస్తులు ఒకే అభిప్రాయంతో సబ్ కలెక్టర్ ఎదుట రాతపూర్వకంగా ప్రకటన ఇచ్చినా, చలపతి నాయుడు అభ్యంతరాలు తెలుపుతూ తమకు పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమకు 1బి జారీ చేయకూడదని కోర్టు నుంచి ఎలాంటి ఇంజంక్షన్ లేదా స్టేటస్ కో ఉత్తర్వులు లేవని రైతులు పేర్కొన్నారు.

 

పొన్నూటిపాళెం గ్రామంలో రీ-సర్వే పూర్తయినప్పటికీ వెబ్‌ల్యాండ్-2లో పోర్టింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అనేక సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగా వెబ్‌ల్యాండ్-1 ద్వారా సర్వే నంబర్ల ప్రాతిపదికన 1బి, అడంగల్ మంజూరు చేసి, అనంతరం వెబ్‌ల్యాండ్-2కు మార్పు చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులు ఇందుకు అంగీకరించి ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, అడిషన్ ఎనేబుల్ ప్రక్రియ సబ్ కలెక్టర్ లాగిన్‌లోనే నిలిచిపోయిందని రైతులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ...
By Krishna Balina 2026-05-06 09:07:27 0 333
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి...
By Sidhu Maroju 2025-06-04 17:53:37 0 2K
Andhra Pradesh
కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
కవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Jeeru Kumar 2026-03-02 11:10:35 0 1K
Andhra Pradesh
మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
      రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-08-11 09:32:04 0 212
Telangana
రౌడీ షీటర్‌‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్.. సన్మానించిన సీపీ సజ్జనార్
సామాన్య ఆటో డ్రైవర్ అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోతున్న...
By Ponnala Srinivasrao 2026-05-06 04:29:14 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com