జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మల్కాజ్గిరి ప్రజా సమస్యలను తెలియజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
1K

 

1. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ఆర్ యు బి లు నిర్మాణం కోసం 100% నిధులు ఇస్తామని ఎన్వోసీలు తీసుకొని జలమండలి, విద్యుత్, టౌన్ ప్లానింగ్ వివిధ శాఖలతో సమన్వయంతో ఎన్వోసీ తీసుకొని తాను ఎమ్మెల్యే అయినప్పటినుండి సంవత్సర కాలం నుండి ఆర్యుబి నిర్మాణం అనుమతి తేవాలంటే సంవత్సర కాలం సమయం పట్టిందని ఆర్ యు బి నిర్మాణాల కోసము రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో చుట్టూ తిరిగి అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి కంపెన్సేషన్ ఇవ్వడానికి ఎంత ఖర్చు కావాలా ఉదాహరణకు 74 కోట్లతో వాజపేయి నగర్ రైల్వే బోర్డు ఇస్తామని చెప్పినాక మన వాళ్లు బండ గుర్తు లాగా  ఇంత అవుతుందని చెప్పేస్తున్నారు. అది సరిగ్గా వివరాలు లేక ఏమవుతుందంటే ఆ ఫైల్ ను వెనుకకు వాపస్ పంపిస్తున్నారు దయచేసి సారు చెప్పిన విధంగా ముందుకు తీసుకుపోవాలి. 

2. వార్డు ఆఫీసులో కు తాళాలు వేసి నిరుపయోగంగా ఉన్న వార్డ్ ఆఫీసులను కమ్యూనిటీ హాలుగా స్థానిక కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా చూడాలని ఉదాహరణగా 135 వెంకటాపురం డివిజన్ అశోక్ నగర్ లోగల హరిజన బస్తిలో ఉన్న వార్డు కార్యాలయం నిరూపయోగం ఉండడంతో స్థానిక పేద ప్రజలు పుట్టినరోజులు గాని ఎవరైనా కాలం చేసి తర్వాత అవసరాలకు ఉపయోగించుకునేలా లేకుండా పోయిందని వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు

3. హిందువులను చాలా చులకనగా చూస్తున్నారు మచ్చ బొల్లారం డివిజన్లోని సర్వే నెంబర్ 198 ,199 లో గల హిందూ స్మశాన వాటిక లో రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ నిర్మించి రాంకీ సంస్థకు అప్పగించారు స్థానిక జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రెండు ఎకరాల స్థలం డంపింగ్ యార్డ్ కు కేటాయించారని అంటున్నారు స్థానిక ఎమ్మార్వో గారు కలెక్టర్ గారు అది హిందూ స్మశాన వాటిక స్థలం అనేసి తెలుపుతున్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నారని హిందూ స్మశాన వాటిక ను పరిరక్షించాలని కోరారు 

4. మల్కాజ్గిరి డివిజన్ సఫిల్గుడాలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP నిర్మాణం వద్ద చెక్ డ్యాం కట్టేటప్పుడు సిల్ట్ తీయకపోవడంతో పేరుకుపోయి దాని వెనుక ఉన్న బలరాం నగర్ లో నీరు పేరుకుపోయి అక్కడ ఉన్న మురుగునీరు రాకుండా రివర్స్ పోతుంది స్థానిక బలరాం నగర్ పరిసర కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిల్ట్ తీయమని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మెగా ప్రాజెక్టు జిహెచ్ఎంసి అప్పగించగా సంవత్సరకాలం కోట్లాది ప్రజా ధనం వృధా అవుతుందని ఎన్నిసార్లు సిల్ట్ తీయమని అడిగినా మెగా కాంట్రాక్టర్ జిహెచ్ఎంసి అధికారులు ఎవరూ మాకు సంబంధం లేదు అంటున్నారు నీరు వచ్చి ఓవర్ ఫ్లో అయితుంది అదే నీరు చెరువులోకి పోతుంది కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టి దానిని ఏ విధంగా నిరుపయోగంగా ఉంచారు ప్రజలకు ఉపయోగించుకునే పరిస్థితి లేదు సిల్ట్ తీయకపోవడంతో నీరు పైనుంచి ఓవర్ ఫ్లో అవుతుంది ప్రతి ఎస్టిపి దగ్గర ఫ్లోమీటర్ను పెట్టి చెక్ చేయాలని కోరుతున్నాను.  

5. పారిశుద్ధ కార్మికుల కొరతతో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పారిశుద్ధ కార్మికులు 476 మంది అందులో డెత్ కేసులు, డిలీట్ చేయబడ్డ వారిని కలిపి 38 , వారాంతపు సెలవుల పైన 50 నుంచి 52 మంది వీధులకు హాజరు కారు, రోజు పని చేసేవారు 360 నుంచి 370 మంది ఉంటారు

కానీ రోడ్డు సాంద్రతను బట్టి 760 మంది కావలసి ఉంటుంది పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగడంలేదని ఏ ఏం హెచ్ ఓ ల దృష్టికి తీసుకెళ్లిన పారిశుద్ధ కార్మికుల సిబ్బంది కొరత ఉందని అంటున్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని 

6. సి ఆర్ ఎం పీ రోడ్ల మల్కాజ్ గిరి సర్కిల్ గాని ,అల్వాల్ సర్కిల్ లో గానీ వారి కాంట్రాక్టు ప్రకారం ఒక్క పని, నిర్వహణ సరిగ్గా లేదని జోనల్ కమిషనర్ లు పట్టించుకోవడం లేదని, రోడ్ల కింద ఉన్న నాళాలను ఎక్స్పాన్షన్ చేయాలని, ఫుట్పాత్ లు నిర్మించాలని కానీ చేయడం లేదు వీటిపై విజిలెన్స్ టీం వేయాలని విజిలెన్స్ టీమ్ లో తనను మెంబర్ గా నియమించాలని జోనల్ కమిషనర్లు రివ్యూ మీటింగ్లు పెట్టడం లేదని ఆరు నెలల కాలం అయితే వారు బయటపడిపోతారని అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కార దిశగా కృషి చేయాలని, మల్కాజ్గిరి అభివృద్ధికి నూతన ప్రతిపాదనలు జిహెచ్ఎంసి కమిషనర్ కు అందజేసారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC 2025 Supplementary Exams Started From today onwards
The Board of Secondary Education, Andhra Pradesh, has announced that the SSC 2025 supplementary...
By BMA ADMIN 2025-05-19 12:10:11 0 1K
International
బ్రిటిష్ డిజైన్, అరబ్ కళల కలయిక రియాద్‌లో |
అక్టోబర్ 16, 2025న రియాద్ ఫ్యాషన్ వీక్‌లో బ్రిటిష్ ఫ్యాషన్ దిగ్గజం వివియెన్ వెస్ట్‌వుడ్...
By Deepika Doku 2025-10-10 07:48:03 0 74
Andhra Pradesh
ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తాత్కాలికంగా మూత |
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది సెప్టెంబర్ 27 వరకు మూతపడాయి....
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:15:26 0 107
Sports
SA vs IND: పంత్‌కి కెప్టెన్సీ.. రెండు వేర్వేరు జట్లు |
దక్షిణాఫ్రికా ఏతో జరగనున్న నాలుగు రోజుల రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇండియా రెండు వేర్వేరు...
By Bhuvaneswari Shanaga 2025-10-21 10:55:09 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com