మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్

0
207

 

 

 

రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని కరపత్రాలను పంపిణి చేశారు. అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మెగా డీఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, చేసిన మంచి పనిని చెప్పకపోతే, తప్పుడు ప్రచారమే నిజం అనుకుంటారని, వైసిపి చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గం లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులకు వణుకు పుడుతుంది అన్నారు. రాయచోటిలో గత రెండు రోజులుగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే.అర్థం తెలియని వారు కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Agricultural Growth and Farmer Support Plans
Jharkhand is advancing agricultural development through a range of farmer support initiatives...
By Fathima Safa 2026-06-24 09:37:23 0 189
Andhra Pradesh
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-04-26 10:59:50 0 148
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Andhra Pradesh
పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును...
By Benguluri Madhubabu 2026-04-09 07:33:01 0 213
Telangana
సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|
    హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ...
By Sidhu Maroju 2026-02-05 08:35:19 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com