7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన
Posted 2026-05-06 09:07:27
0
327
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ యూనిట్ స్థాపనతో మంథని పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని, ముఖ్యంగా మహిళా స్వయం ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
Syedain Abbasi IAS: A Visionary Administrator Transforming Assam
A 1990-batch Assam–Meghalaya cadre IAS officer whose decades of administrative excellence...
Jharkhand’s Oath for Peace: Rehabilitating Former Criminals
In a pioneering effort to combat crime at its roots, the Jharkhand Police has launched a...
ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్...
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు
*రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...