బోనాల బాటలో.. ఆలయాలకు ఆర్థిక బలం.|

0
147

● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ

● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు

● పురాతన ఆలయాలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

మల్కాజ్‌గిరి, ఆగస్టు 3: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల దేవాదాయ ఆర్థిక సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మల్కాజ్‌గిరి వాణినగర్‌లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో సోమవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహకార చెక్కులను ఆలయాల ప్రతినిధులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు దేవాలయాలకు అందిస్తున్న ఆర్థిక సహకారం అభినందనీయమని అన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని పురాతన, ప్రసిద్ధ దేవాలయాలకు మరింత అధికంగా నిధులు కేటాయించడంతో పాటు నూతన ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను కలిసి కోరినట్లు తెలిపారు.

తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలందరూ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారులు, ప్రధాన అర్చకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్
*విజయవాడ*:     వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె...
By Rajini Kumari 2025-12-26 10:01:04 0 232
Andhra Pradesh
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
By John Baji 2026-02-04 15:02:53 0 592
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి టి. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు....
By Pagadala Venkateswar 2026-02-20 08:22:59 0 206
Andhra Pradesh
భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
    *అన్నమయ్య జిల్లా | సెప్టెంబర్ 05, 2026*   శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర...
By Benguluri Madhubabu 2026-09-06 00:32:59 0 120
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com