భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరిక
Posted 2026-07-28 15:29:26
0
379
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: 28 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. జులై 28 నుండి జులై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆమె తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, నదులు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రైతులు పంటలు, వ్యవసాయ పరికరాలను కాపాడుకోవాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు
*ప్రచురణార్థం* *30-12-2025*
షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి...
ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు
ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో...
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు...