ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న

0
307

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ లోని ఇటీకాలలో రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించి, రోడ్డుకు రెడీ మిక్స్ కంకర వేయించే పనులను గ్రామ సర్పంచ్ శ్రీ సత్ర వేణి రాజన్న దగ్గరుండి చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై బురద ఎక్కువగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు విన్నవించారు.గ్రామస్థుల అభ్యర్థన మేరకు సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న, ఉపసర్పంచ్ శ్రీమతి అయిలవేణి లక్ష్మీ కిష్టయ్యలు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను తవ్వి, నిలిచిన బురదను పూర్తిగా తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుపై రెడిమిక్స్ కంకరను వేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని పనులను విజయవంతం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించి రెడీ మిక్స్ కంకర వేయించినందుకు సర్పంచ్ గారికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
By Pagadala Venkateswar 2026-03-31 03:27:19 0 183
Telangana
హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2026-04-02 07:24:44 0 274
Andhra Pradesh
చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!
చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని...
By Shyamala Yadagiri 2026-06-23 02:16:55 0 208
Telangana
Fifa world cup
హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ (అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్)...
By G k Nookala 2026-07-07 17:09:46 0 139
Andhra Pradesh
పుంగనూరు: ఈనెల 26న బోయకొండ ఆలయంలో హుండీ లెక్కింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 26న...
By Kothuru Murali 2026-03-26 14:19:47 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com