చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!

0
208

చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి  పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, అవసరమైన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది," అని వెంకట్ అన్నారు. "అనస్థీషియా డాక్టర్ లేకపోవడం వల్ల, గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా ఇతర నగరాలకు వెళ్లవలసి వస్తుంది, ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. "సురేష్ మాట్లాడుతూ, "చింతూరు మరియు పరిసర గ్రామాలకు ఈ ఆసుపత్రి కీలకమైనది. ఇక్కడ ప్రసవ సేవలు నిలిచిపోవడం వల్ల పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని తెలిపారు. "ప్రభుత్వం వెంటనే స్పందిించి అనస్థీషియా డాక్టర్ ను నియమించాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము," అని వారు హెచ్చరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 370
Sports
రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...
By Avunoori Mahesh 2026-06-29 00:39:47 0 276
Telangana
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ...
By Ponnala Srinivasrao 2026-05-23 02:17:07 0 163
Telangana
(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి...
By Avunoori Mahesh 2026-07-11 11:35:31 0 319
Telangana
పెల్లెట్‌పై పంచ్..!
● ప్రాణరక్షణలో చివరి ప్రత్యామ్నాయమేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయం ● ఢిల్లీ ఘటనపై కొనసాగుతున్న...
By Sidhu Maroju 2026-07-28 12:28:21 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com