మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.

0
1K

కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తాళ్లపల్లి రవి తెలిపారు. శుక్రవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సమాజ సేవకుడు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్ డాక్టర్ బోల్లమల్ల నర్సింగ్ రావులు ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మాల ముద్దు బిడ్డ గడ్డం వివేక్ ను కలిశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామిని గజమాలతో సత్కరించి సన్నానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు సంపాదించిన మాల జాతి ముద్దు బిడ్డ, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ఏర్పాటు కోసం పదవి త్యాగం చేసిన త్యాగశిలీ అని కొనియాడారు. తండ్రి (కాకా) వెంకట స్వామి అడుగు జాడల్లో ప్రజా సేవలో ఎల్లప్పుడు ముందు ఉండే వివేక్ వెంకట స్వామి సేవలను గుర్తించి మంత్రిగా పదవీ బాద్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, ఎం.కాంతయ్య, సోషల్ మీడియా కన్వీనర్ పెరుమాళ్ళ ధనమ్మ, సామాజికవేత్త డా.రాజు వడాల భాస్కర్, రాష్ట్ర నాయకులు మాడుగుల శ్రీనివాస్, బొప్ప నగేష్, తాళ్లపల్లి విజయ్, నరేష్, సిహెచ్ దివ్య, గౌరీ, చైతన్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Technology
సార్వభౌమ ఏఐకు ICAI కంపెనీ డేటా సమర్పణ |
ఇండియా సార్వభౌమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి కీలకంగా మారే విధంగా ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
By Bhuvaneswari Shanaga 2025-10-13 09:58:46 0 36
Andhra Pradesh
జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయండి*
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి - జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరిన...
By mahaboob basha 2025-08-18 23:16:12 0 452
Andhra Pradesh
ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం
గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం, నిజాం...
By mahaboob basha 2025-07-05 11:45:21 0 1K
Telangana
హైదరాబాద్‌లో డిజిటల్ లోన్ షార్క్స్ తిరిగి వెలుగులోకి |
హైదరాబాద్‌లో డిజిటల్ లోన్ షార్క్‌లు మళ్లీ ప్రజలను వేధిస్తున్నాయి. ప్రీడేటరీ లోన్...
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:09:35 0 38
Andhra Pradesh
పారిశ్రామిక వేగం: అనుమతులకు ఇక 'రెడ్ టేప్' దూరం |
రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున...
By Meghana Kallam 2025-10-10 04:56:52 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com