గూడూరు జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల‌కు యూనిఫార్మ్స్ , బ్యాగుల పంపిణీ

0
1K

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీకి చెందిన జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్‌లు మరియు బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మార్గదర్శకాలు, డీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి గారి సమన్వయం,కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు స్కూల్ కమిటీ చైర్మన్ మల్లాపు ఆశీర్వాదం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ హెడ్మాస్టర్ మరియు టీడీపీ యువ నాయకుడు బోజుగు సృజన్ విద్యార్థినులకు స్వయంగా యూనిఫామ్‌లు మరియు బ్యాగులు అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి, తిమోతి, సులేమాన్, చిరంజీవి, ఎలీషా, బోజుగు వినోద్, ఎం. రాజశేఖర్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు.ఈ విధంగా విద్యార్థినుల భవిష్యత్‌ను మెరుగుపర్చే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com