Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.

0
371

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. 

 

సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్ వర్క్ ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. సుమారు రూ. 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...
By Pagadala Venkateswar 2026-09-03 12:46:58 0 105
Andhra Pradesh
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు    ...
By Rajini Kumari 2025-12-29 13:11:37 0 205
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 141
Telangana
మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం...
By Ponnala Srinivasrao 2026-05-01 02:46:02 0 173
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com