"బండి-ఈటల విభేదాలకు ముగింపు".|

0
284

- కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం

- అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు

- పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని 'ఏక్ హై' అంటూ ఐక్యత చాటారు.

ఇకపై వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కలిసి పనిచేయాలని ఇరువురు నిర్ణయించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పరిణామం కీలకంగా మారనుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Disaster Management and Relief
During natural disasters like floods, the Karnataka Police consistently stands at the forefront...
By Kalaga Sailaja 2026-06-29 10:26:53 0 222
Andhra Pradesh
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:49:12 0 191
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 293
Andhra Pradesh
దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను...
By Kothuru Murali 2026-06-06 14:21:39 0 131
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com