SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|

0
242

"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన"

మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు. 

ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆల్వాల్ ల్లోని వెంకటాపురం, భూదేవి నగర్, ఖనాజీగూడ డివిజన్‌ల బీఆర్ఎస్ బీఎల్ఏలతో శుభశ్రీ గార్డెన్, శ్రీ సత్యసాయి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన అవగాహన, సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

SIR కార్యక్రమం అమలు తీరును సమీక్షించి, క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2002 ఓటరు జాబితాలో పేరు లేని అర్హుల నమోదు, ఒకే కుటుంబంలోని సభ్యుల పేర్లు జాబితాలో లేకపోతే అనుసరించాల్సిన విధానం, ECINET పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌లు అందకపోవడం, వృద్ధులకు ఫారమ్‌లు చేరకపోవడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, మరణించిన లేదా డబుల్ నమోదైన ఓటర్ల పేర్ల తొలగింపుకు ఫారం-7, పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాల సవరణకు ఫారం-8 వినియోగంపై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఇంటికి చేరుకుని ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీని పూర్తి చేసి, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎల్ఏలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశాల్లో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు తోట నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:37:18 0 277
Ladakh
Tata Power Powers Ladakh’s First Commercial Rooftop Solar Project
Marking a monumental shift toward clean energy, Tata Power Renewable Energy Limited successfully...
By Dunna Jessicaruth 2026-05-16 06:19:28 0 130
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 366
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 123
Andhra Pradesh
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
By Kothuru Murali 2026-01-29 08:57:35 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com