పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
171

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం నియోజకవర్గం లోని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ నకు చెందిన గణపాక ప్రభాకర్ గారికి 2 లక్షల 50 వేల రూపాయలు, మల్కాజ్ గిరి జె యల్ ఎన్ ఎస్ నగర్ నకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ గారికి 1 లక్ష రూపాయలు మొత్తం 4 లక్షల విలువ గల 2 LOC లు మంజూరు అయ్యాయి.వీటిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం తుకారాం గేట్ లోని ఎమ్మెల్యే నివాసంలో పేషెంట్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, కార్పోరేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలో కూడా మంచి వైద్యం అందిస్తుందని, కావున పేద ప్రజలు వైద్యం కోసం ఎటువంటి వ్యయ ప్రయాసలకు గురి కావద్దని, వైద్య సహాయం కోసం ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Odisha
Odisha Govt Approves Rs 2,500 Crore for Infrastructure Boost in Rural
The Odisha government has sanctioned ₹2,500 crore for major infrastructure development projects...
By Bharat Aawaz 2025-07-17 10:55:47 0 1K
West Bengal
বঙ্গ BJP’র “নারেন্দ্র কাপ” ফুটবল টুর্নামেন্ট আজ থেকে শুরু
বঙ্গ #BJP আজ থেকে “#নারেন্দ্র_কাপ” নামে বিশেষ ফুটবল টুর্নামেন্টের আয়োজন করেছে। এই...
By Pooja Patil 2025-09-11 11:25:39 0 146
Telangana
కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ. - తమిళనాడులోని...
By Sidhu Maroju 2025-09-28 14:13:36 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com