నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి.

0
192

నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఎవ‌రికి ఉంది?

‎నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి క‌నీస అవ‌గాహ‌న లేకుండా ద‌బాయిస్తున్నారు. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది క‌రువు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి అంగీక‌రిస్తున్నారు. గోదావ‌రికి పైనుంచి- అంటే శ్రీ‌రాంసాగ‌ర్ నుంచి వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం లేదు అని కూడా వారికి తెలుసు. 

‎అయినా అదే నోటితో క‌న్నెప‌ల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల బ‌రాజుల‌ను నింపితే అవి కూలిపోతాయి, ఊళ్లు మునుగుతాయి, భ‌ద్రాచ‌లం కొట్టుకుపోతుంది అని భ‌య‌పెడుతున్నారు. చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా 20 ల‌క్ష‌ల క్యూసెక్కులకు పైగా వ‌ర‌ద వ‌చ్చిన 2022లోనే ఆ బ‌రాజుల‌కు ఏమీ కాలేదు, భ‌ద్రాచ‌లానికీ ఏమీ కాలేదు. అన్నారం, సుందిళ్ల బ‌రాజుల వ‌ద్ద కొన్ని బుంగలు ప‌డ‌డం, వాటిని గ్రౌటింగ్‌తో మ‌ర‌మ్మ‌తు చేయ‌డం ఎప్పుడో జ‌రిగిపోయింది.  

‎ఆ బ‌రాజుల‌ను కూడా పూర్తిస్థాయిలో నింపాల్సిన ప‌నిలేదు. స‌గం నీటి మ‌ట్టం నింపితే చాలు అటు అన్నారం, ఇటు సుందిళ్ల పంపు హౌజుల‌కు నీరు అందుతుంది. సునాయాసంగా నీటిని ఎల్లంప‌ల్లికి ఎత్తిపోయ‌వ‌చ్చు. ఎత్తిపోత‌ల నీటితో బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డి కూలిపోయే ప్ర‌మాదం ఏమీ లేదు. పైనుంచి పెద్ద మొత్తంలో వ‌ర‌ద వ‌స్తేనే బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

‎వాస్త‌వం ఇలా ఉంటే మెద‌డులో గుజ్జు గురించి మాట్లాడ‌డం ఏంబాగుంటుంది? గుజ్జు ఎవ‌రికి ఉన్న‌ట్టు ఎవ‌రికి లేన‌ట్టు? హైదరాబాద్లో ఇప్పటికే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు నీటిని ఎత్తిపోయ‌క‌పోతే హైద‌రాబాద్ నీటి క‌ష్టాల‌కు, ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల క‌రువు క‌ష్టాల‌కు ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి ఇద్ద‌రూ బాధ్య‌త వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది.  

‎కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ కాదు. ఎల్లంపల్లి నుంచి బస్వాపురం దాకా నిర్మించిన రిజర్వాయర్లు కూడా అందులో భాగమే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో 60 టీయెంసీల నిల్వ సామర్థ్యం రూపకల్పన చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో 150 టీయెంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. అవి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. రెండున్నరేళ్లు బద్నాం గేముతో కాలక్షేపం చేశారు. ఇక చాలు. మేడిగడ్డ బరాజుకు మరమ్మతు పూర్తిచేయండి. ఈ సమస్యను ఇంకా సాగదీస్తే తెలంగాణ ప్రజలముందు మీరు దోషులుగా మిగులుతారు.

‎ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

Search
Categories
Read More
Andhra Pradesh
పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.
శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట...
By Pagadala Venkateswar 2026-04-18 04:06:55 0 135
Telangana
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్...
By Avunoori Mahesh 2026-07-18 09:29:00 0 245
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 296
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
 గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court)...
By John Baji 2025-12-30 11:35:53 0 206
Andhra Pradesh
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా...
By Boiena Rajesh 2026-04-28 03:06:55 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com