రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!

0
660

మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ  పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB యంత్రాలను రప్పించి కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా పుల్సం సురేష్ మాట్లాడుతూ, మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు "రైతు సమస్య అంటే అది ప్రజా పాలన ప్రభుత్వ సమస్య. ప్రభుత్వం నిధులు విడుదల చేసేలోపు పంట దెబ్బతింటుంది. అందుకే సీతక్క ఆదేశాల మేరకు ముందుగా మేమే ముందుకు వచ్చి కాలువలను శుభ్రం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కాలువల్లో కూడా పూడిక తొలగిస్తాం" అని తెలిపారు.

రైతుల హర్షం
  
ట్రస్ట్ బోర్డ్ చొరవను స్థానిక రైతులు అభినందించారు. "ముసలమ్మ ట్రస్ట్, సురేష్ అన్న లేకపోతే మా పంటలు నష్టపోయేవి. ఇప్పుడు కాలువ క్లీన్ కావడంతో నీరు సాఫీగా పొలాలకు వెళ్తుంది" అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డ్ మెంబర్ గుంట అరుణ సూర్యం, నర్సింగరావు, బుచ్చి రాములు, పవన్ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో...
By Pagadala Venkateswar 2026-04-10 05:59:06 0 142
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 182
Andhra Pradesh
చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!
చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Shyamala Yadagiri 2026-09-07 17:31:36 0 139
Telangana
ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-13 10:34:05 0 173
Telangana
పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని...
By Sidhu Maroju 2026-02-21 14:38:35 1 433
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com