తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
2K

*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి సర్కిల్ బి ఆర్ యస్ నాయకులు జెఎసి వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను కార్పొరేటర్ , మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. మల్కాజ్గిరి చౌరస్తా గాంధీ పార్కు లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను స్మరించుకుంటూ, భారీ ఎత్తున రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేశారు, ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులతో సంతోషంగా గడిపి వారితో కలిసి రక్తదాన శిబిరం,అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలను వివక్షలను ఎదుర్కొని తెలంగాణ సాధన కోసం కష్టనష్టాలను ఎదుర్కొని ఆత్మ బలిదానాలు ఇచ్చిన సందర్భాలను గుర్తుకు చేసుకోవాలని అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ సాధించడానికి సారధిగా వ్యవహరించి ఆత్మ బలిదానానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టారని అన్నారు. బంగారు తెలంగాణ కు శ్రీకారం చుట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని గుర్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాజీ కార్పొరేటర్, జగదీష్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి , రావుల అంజయ్య, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, బాబురావు ,కాటమరాజు, ఉపేందర్ సతీష్, నర్సింగరావు, శివకుమార్, హేమంత్ పటేల్, గోపాల్, ఉస్మాన్, భాగ్యనంద్, దినేష్, సంతోష్, మారుతి ప్రసాద్, హేమంత్ రెడ్డి, బాలకృష్ణ, ఫరీద్, అరుణ్ రావు, పేపర్ శీను, గోపాల్, శేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ యాదవ్, సుమన్ గౌడ్, సాయి గౌడ్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, వినీత్ సందీప్ నిఖిల్ రెడ్డి, జనార్ధన్, మురళి,,అధిక సంఖ్యలో యువకులు మహిళలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Like
1
Search
Categories
Read More
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
Andhra Pradesh
మావుల ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత ప్రగతి |
రాష్ట్ర ప్రభుత్వం మావుల ప్రాంతాల్లో డాక్టర్ల 90% ఖాళీలను విజయవంతంగా భర్తీ చేసింది. దీని ద్వారా...
By Bhuvaneswari Shanaga 2025-09-24 12:06:12 0 107
Telangana
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఈరోజు మహారాష్ట్ర లోని...
By Sidhu Maroju 2025-09-28 12:57:28 0 70
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com