జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు

0
2K

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం..

హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు

 

ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పర ప్రసాద్  పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తలొంచి జర్నలిస్టుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి అతిధులుగా విచ్చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయం సందర్శించి నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Coal Minister Announces Wage & Safety Reforms for Workers
The #CoalMinister in #Jharkhand announced improved wages and working conditions for coal...
By Pooja Patil 2025-09-13 11:38:14 0 95
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 1K
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 23
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 555
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com