రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

0
2K

రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు

Sad
1
Search
Categories
Read More
Telangana
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి...
By Vadla Egonda 2025-06-10 08:41:31 0 1K
Telangana
బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డికు అవకాశం |
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ తన...
By Bhuvaneswari Shanaga 2025-10-15 11:12:22 0 31
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com