క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|

0
187

"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

కొత్తగా ఓటర్లుగా నమోదు కావాల్సిన వారు, పేర్లు సవరించుకోవాల్సిన వారు, చిరునామా మార్పులు లేదా ఇతర వివరాల సవరణ అవసరమున్న వారు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ ఫారాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. 

ప్రజలు కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ...
By Pagadala Venkateswar 2026-06-12 04:26:17 0 125
Andhra Pradesh
ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు.
    ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు 11-06-2026...
By Pagadala Venkateswar 2026-06-11 05:44:09 0 122
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు
 ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం...
By Benguluri Madhubabu 2026-04-07 06:35:13 0 242
Andhra Pradesh
పుంగనూరు: గ్రామంలో చేస్తున్న భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో కన్యాకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులను...
By Kothuru Murali 2026-06-23 15:14:43 0 103
Andhra Pradesh
కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...
By Benguluri Madhubabu 2026-04-17 14:10:22 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com