ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.

0
104

 

ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి

25-06-2026 Thu 11:22

Andhra

Kiran Kumar Reddy says current politics have degraded

రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి

సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ

టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు పర్యటనలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్, టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతిపై తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఒకప్పుడు రాజకీయాలు పాలసీ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవని, ఇప్పుడు కేవలం వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయని చెప్పారు.

 

 

 

సమాజంలో మిగిలిన ప్రొఫెషన్స్‌తో పోలిస్తే రాజకీయాల్లో విలువలు దారుణంగా పడిపోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. "డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు కోర్టుల్లోనో, బయటో ఎంత వాదించుకున్నా ఒకరినొకరు వ్యక్తిగతంగా గౌరవించుకుంటారు. అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇచ్చుకుంటారు. కానీ, రాజకీయాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. సిద్ధాంతాలు పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువవుతోంది" అని విమర్శించారు.

 

 

 

ప్రస్తుత మీడియా కల్చర్‌పై కూడా మాజీ సీఎం గట్టిగానే కౌంటర్ వేశారు. "ఇప్పుడు వస్తున్న టీవీ డిబేట్లను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూసే పరిస్థితి అస్సలు లేదు. ఆ చర్చల్లో వాడే భాష, అరచుకునే విధానం చూస్తే.. అసలు టీవీనే ఆఫ్ చేసేయాలనే అంతటి విరక్తి కలుగుతోంది" అని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్య పదజాలం, ట్రోలింగ్ సంస్కృతి ఏమాత్రం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

 

 

 

రాజకీయాలు అంటే ప్రజలకు సంబంధించినవని, అక్కడ వ్యక్తిగత అజెండాలకు తావుండకూడదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అసెంబ్లీల్లో, బయట చర్చలు జరగాలే తప్ప.. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాల స్థాయిని దిగజార్చవద్దని లీడర్లకు సూచించారు. నాయకుల మధ్య పరస్పర గౌరవం లేకపోవడం వల్లే పబ్లిక్‌లో రాజకీయ విలువల గ్రాఫ్ క్షీణిస్తోందని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!
మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-01 15:00:03 0 216
Telangana
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
By Sidhu Maroju 2026-06-15 13:30:26 0 131
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*   ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...
By Rajini Kumari 2026-06-06 11:04:10 0 348
Telangana
ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2026-01-06 10:09:48 0 230
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com