నిజామాబాద్

0
185

మాక్లూర్‌లో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గణేష్ బిగాల, మహేష్ బిగాల...

నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లోని శ్రీ విట్ఠలేశ్వర రుక్మిణి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మరియు శ్రీ వీర హనుమాన్ స్వామి ఆలయాల నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మరియు BRS పార్టీ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల గారు పాల్గొన్నారు.

బిగాల సోదరుల ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయాల నాల్గవ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు బిగాల సోదరులు నిరంతరం కృషి చేస్తున్నారని భక్తులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 28న మదనపల్లెకు వైఎస్ జగన్ రాక.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఖరారు...
By Pagadala Venkateswar 2026-06-19 04:36:01 0 142
Andhra Pradesh
* KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం
*నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం,...
By VALLERU SIMHADRI 2026-09-03 13:27:49 0 256
Andhra Pradesh
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
By Rajini Kumari 2026-04-02 16:40:00 0 214
Andhra Pradesh
ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని...
By Pagadala Venkateswar 2026-06-15 06:40:59 0 100
Telangana
హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ నగరంలో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ నటి...
By Ponnala Srinivasrao 2026-07-22 01:53:56 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com