అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్.

0
124

 

 

అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్

13-06-2026 Sat 15:53

Andhra

Satya Kumar Yadav highlights revolutionary changes in Andhra Pradesh health sector

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సత్యకుమార్

ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య

ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారని గుర్తుచేశారు. 

 

 

 

గత రెండేళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్ ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను, వారి వైద్య చరిత్రను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓపీ సేవల నుంచి స్పెషలిస్ట్ వైద్య సేవల వరకు అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు.

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సాంప్రదాయ వైద్య విధానాల నుంచి ‘ప్రెడిక్టివ్ హెల్త్‌కేర్’ విధానంలోకి అడుగుపెట్టామని మంత్రి చెప్పారు. అంటే.. వ్యాధి వచ్చాక వైద్యం చేయడం కంటే, అది రాకముందే గుర్తించేలా వ్యవస్థను మార్చామన్నారు. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, దీనివల్ల వ్యాధులను ముందే గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా రోగుల సందేహాలకు నిపుణులైన వైద్యులతో సమాధానాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు.

 

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన సేవల వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం, సంతృప్తి పెరిగాయని.. అందుకే ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సత్యకుమార్ అన్నారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఆసుపత్రుల్లోని గణాంకాలే నిదర్శనమని చెప్పారు. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని చెబుతూ.. ఈ మార్పునకు సహకరించిన వైద్య సిబ్బందికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు

Search
Categories
Read More
Telangana
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు...
By Gujile Ramu 2026-04-27 11:05:15 0 536
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం. పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు.
మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన...
By Pagadala Venkateswar 2026-08-20 06:07:14 0 88
Andhra Pradesh
Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో...
By Pagadala Venkateswar 2026-07-20 11:32:59 0 115
Andhra Pradesh
నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు...
By Pagadala Venkateswar 2026-05-02 04:05:07 0 129
Andhra Pradesh
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి...
By Kothuru Murali 2026-01-12 08:27:14 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com