మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు: ఇంటింటికీ ఫీవర్, లార్వా సర్వే
Posted 2026-06-12 14:34:57
0
136
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శుక్రవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇరికిపెంట దిడ్డివారిపల్లి సచివాలయం పరిధిలో భారతం మిట్ట, వడ్డీపల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. లార్వా ఉన్న నీటిని బయటకు పారబోసి, కొన్ని చోట్ల అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, ఫ్రైడే డ్రైడే గురించి ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించారు. ఈ కార్యక్రమంలో డా. రాజ్ కుమార్ నాయక్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, సీహెచ్‌ఓ అమర్నాథ్, వసంత కుమార్, సుధాకర్, శాంభవి, రోజా, మదనిక, గీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
3వ రోజు ఆట ల పోటీలు
విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే
పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన...
NITI Aayog Unveils Latest Global Trade Watch Report
ndia's premier policy think-tank, NITI Aayog, has officially released the eighth edition of its...
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*
*Jan 21st, 2026*
...
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...