గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుదాం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

0
293

 

 

 

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... లేకపోతే జైలుకే*

 

*డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన సీపీ*

 

గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై చికిత్స పొందుతున్న వ్యక్తులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీపీ,15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు.

వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని,వారి ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.గంజాయి విక్రేతలు,మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు.డ్రగ్స్ రహిత కమిషనరేట్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వైద్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
In September or October notification dsc
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా...
By G k Nookala 2026-08-23 06:40:15 0 122
Andhra Pradesh
నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20,...
By Rajini Kumari 2026-02-20 23:22:13 0 206
Telangana
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
By Mittapelli Saketh 2026-02-17 10:12:47 0 522
Andhra Pradesh
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ...
By Benguluri Madhubabu 2026-02-13 06:39:06 0 326
Andhra Pradesh
ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి...
By Pagadala Venkateswar 2026-09-17 05:26:04 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com