ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.

0
50

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది.

 

విడుదలైన నోటిఫికేషన్ల ప్రకారం, మొత్తం 378 సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై), 1,569 కానిస్టేబుల్, ఇతర అనుబంధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సై విభాగంలో సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలు ఉండగా, కానిస్టేబుల్ కేటగిరీలో సివిల్, ఏఆర్, ఫైర్‌మెన్, జైలు వార్డర్లు, కమ్యూనికేషన్స్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడ
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో...
By Patan Khuddus 2026-04-18 16:15:13 0 803
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు...
By Pagadala Venkateswar 2026-01-15 11:30:01 0 269
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 118
Telangana
"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని...
By Sidhu Maroju 2026-07-23 07:04:54 0 147
Telangana
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
By Thalakokkula Sadanandam 2026-05-23 13:56:11 0 428
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com